January 28, 2010

‘కొమరం పులి’ లో శ్రియ ఐటెమ్ సాంగ్

Posted in Films, News, Telugu tagged , , , , , , at 12:59 pm by itsourteamwork

తెలుగులో నేరుగా చిత్రాలు చేయడం మానుకున్న చిలిపి కళ్ల శ్రియ అడపా దడపా ఐటమ్ సాంగ్స్ మాత్రం చేస్తోంది. ఆ మధ్య వెంకటేష్ పక్కన ‘తులసి’, దేవదాసు, మున్నా, సినిమాల్లో ఓ ఐటమ్ సాంగ్ చేసింది శ్రియ. తాజాగా, పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న ‘కొమరం పులి’ చిత్రంలో ఐటెమ్ సాంగ్ చేయడానికి అంగీకరించిందని సమాచారం. అయితే శ్రియ ఇంతకు మునుపే పవన్ కళ్యాణ్ తో బాలు ఎబిసిడిఇఎఫ్ జి చిత్రంలో నటించి ప్రేక్షకాదరణ పొందిన విషయం అందరికి తెలిసిందే. సింగనమల రమేష్ నిర్మాణంలో ఎస్. జె. సూర్య దర్వకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ ఐటెమ్ పాటకి శ్రియ భారీగానే డబ్బు పుచ్చుకుందట. ప్రస్తుతం తమిళంలో రెండు సినిమాల్లో కథానాయిక నటిస్తోంది. సో పవన్ కళ్యాణ్ తో శ్రియాను అలాగే తమిళ స్టార్ ‘శింబు’ ను ఈ సినిమాలో చూడవచ్చు అంటున్నారు దర్శకుడు ఎస్ జె సూర్య..

వరుడు’ మార్చి 26న రిలీజ్

Posted in Films, News, Telugu tagged , , , , , at 12:56 pm by itsourteamwork

స్టయిలిష్ హీరో అల్లు అర్జున్ ‘వరుడు’ గెటప్ లో ఎలా ఉండబోతున్నాడనే సస్పెన్స్ కు కొద్దికొద్దిగా దర్శక నిర్మాతలు తెర తీస్తున్నారు. ఈ చిత్ర కథాంశాన్ని కానీ, అల్లు అర్జున్ గెటప్ ను కానీ ఇంతవరకూ సీక్రెట్ గా ఉంచిన ఫిల్మ్ మేకర్స్ సమ్మర్ కానుకగా రిలీజ్ కు సిద్ధం చేస్తుండటంతో క్రమంగా వర్కింగ్ స్టిల్స్ రిలీజ్ చేస్తూ సినిమాపై మరింత క్రేజ్ ను పెంచుతున్నారు. నాలుగు రోజుల క్రితమే ‘వరుడు’లోగోను ఆవిష్కరించారు. నూతన వధూవరులు ముఖాలు చూపించకుండా పాణిగ్రహణం చేసినట్టు చూపించే డిజైన్ తో ఈ లోగో రూపొందించారు. తాజాగా ‘వరుడు’ ఫస్ట్ లుక్ కూడా ప్రేక్షకులలో సంచలనం కలిగిస్తోంది. ఇందులో పెళ్లి పీటల మీద తలపాగ, షర్టు లేకపోవడం పట్టుబట్టలతో నుదిటికి బాసికం, తలకు పాగా చుట్టిన రాజవంశీకుడి తరహా గెటప్ లో అల్లు అర్జున్, ఆమెకు ఎదురుగా బుట్టలో కూర్చున్న వధువు కనిపిస్తారు. వధువు ముఖం ఇందులో కనిపించకుండా ఉంచటం మరో సస్పెన్స్. టాలీవుడ్ తొలి సిక్స్ ప్యాక్ హీరో అల్లు అర్జున్ మరోసారి సిక్స్ ప్యాక్ తో కనిపిస్తున్నాడు. ‘దేశముదురు’ కోసం కాయకష్టం చేసి ఆరు పలకల బాడీని సాధించిన సంగతి తెలిసిందే. తన తాజా చిత్రం ‘వరుడు’ కోసం మరోసారి సిక్స్ ప్యాక్ తో దర్శనమిస్తున్నాడు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ కు జోడిగా కొత్తమ్మాయి నటిస్తోంది. సినిమా చాలా బాగా వచ్చిందనీ, అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా గుణశేఖర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారని నిర్మాత డి.వి.వి.దానయ్య చెబుతున్నారు. అల్లు అర్జున్ అద్భుతమైన నటన ప్రదర్శించాడనీ, సినిమా రిలీజ్ తర్వాత ప్రతి ఒక్కరూ అతని నటన గురించి ముచ్చటించుకోవడం ఖాయమనీ గుణశేఖర్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిజజీవితంలోని 100 కుటుంబాలకు చెందిన వారిని ఇందులో నటింపజేయడం, అత్తున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించడం విశేషం. తమిళ హీరో ఆర్య విలన్ పాత్ర పోషించగా, సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాస్ మరో కీలక పాత్ర పోషించారు. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం రెండు పాటలు మినహా షూటింగ్ పూర్తి చేసుకుందని, మార్చి 26న రిలీజ్ కు సిద్దం అవుతున్నట్లు సినిమా వర్గల సమాచారం.

తట్టుకోలేనని ఆమెను వదిలేసాడట

Posted in Films, Hollywood, News tagged , , at 12:53 pm by itsourteamwork

ప్రముఖ పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ వరల్డ్ టూర్ లో వుండగా తన ఏజెంట్, మిత్రుడు జాసన్ ట్రావిక్ ను ప్రేమిస్తున్నట్టు తెలిపింది. కానీ ట్రావిక్ ఆమె ప్రేమను ఒప్పుకోలేదు. కేవలం స్నేహితులుగా మిగిలిపోదామని చెప్పాడు. కానీ బ్రిట్నీ మాత్రం పట్టు వదలకుండా అతని ప్రేమకోసం పరితపించింది. ఆమె పట్టుదలతో చివరికి ట్రావిక్ ప్రేమను గెలుచుకుంది. ఆ తర్వాత ట్రావిక్ బ్రిట్నీ మాజీ భర్తను కలిసి తాను బ్రిట్నీని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్టు చెప్పి, అందుకు అతని అనుమతి కూడా కోరాడు. దీంతో బ్రిట్నీ చాలా సంతోషించింది. అంతా సజావుగా జరుగుతోంది అనుకుంటుండగా జాసన్ ట్రావిక్ బ్రిట్నీని వదిలేస్తూ ఆమె నెత్తిన బాంబు వేసాడు. ఇంతకీ అతను ఆమెను వదిలేయడానికి కారణం ఏంటా అని ఆరా తీస్తే బ్రిట్నీయే అని తేలింది. ట్రావిక్ చాలా సరదా మనిషట. అందరితోనూ ఇట్టే కలసిపోయే తత్వం అతనిది. అతనికి అబ్బాయిలు ఎంత మంది స్నేహితులున్నారో అమ్మాయిలు కూడా అంతే మంది ఉన్నారట. కానీ బ్రిట్నీకి ఇది సహించలేదు. జాసన్ తనతో కాకుండా ఇంకెవరితోనైనా సన్నిహితంగా మెలిగితే ఆమె తట్టుకోలేకపోయేది. అతని మీద ఉన్న అతిప్రేమే వల్లే ఈ విధంగా జరిగిందని తెలుసుకోలేకపోయిన ట్రావిక్ ఆమె జాగ్రత్తను ఆంక్షలుగా భావించాడు. దీనికి తోడు ఇటీవల జాసన్ లాస్ ఏంజిల్స్ లోని ఓ బార్ లో బాగా మద్యం సేవించి ఇద్దరు అమ్మాయిలతో చాలా చనువుగా మెలుగుతూ కనిపించాడు. ఆ తర్వాత వారిద్దరిలో ఓ అమ్మాయితో కలసి కార్ లో తన ఇంటికి వెళ్లాడు జాసన్. ఇక్కడ మరో విషయం ఏంటంటే జాసన్ ఆ సమయంలో బ్రిట్నీ నుండీ వస్తున్న ఫోన్ కాల్స్ ను రిసీవ్ చేసుకోలేదట. ఈ విషయం ఆ నోట ఈ నోట పడి బ్రిట్నీ చెవున పడింది. దీంతో ఆమె అగ్గిమీద గుగ్గిలం అయింది. తను ప్రేమించిన వాడు చేసిన మోసాన్ని భరించలేక అతన్ని ఈ విషయమై అడిగితే అతను వారు కేవలం నా స్నేహితురాళ్లు మాత్రమే అని ఆమెకు సర్దిచెప్పే ప్రయత్నం చేసాడు. కానీ ఆమె మానసిక స్థాతి బాగోకపోవడం వల్ల విపరీతంగా ప్రవర్తించింది. దీంతో ట్రావిక్ నేనిక ఆంక్షలను తట్టుకోలేనని చెప్పి ఆమెను వదిలేసాడట.

బ్రాడ్ పిట్, ఏంజలీనా జోలీ విడిపోయారా..??

Posted in Films, Hollywood, News tagged , , at 12:50 pm by itsourteamwork

హాలీవుడ్ లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన అందమయిన జంట బ్రాడ్ పిట్, ఏంజలీనా జోలీ విడిపోయారా..?? ఇప్పుడు అంతటా వినిపిస్తున్న వార్తలను వింటుంటే అవుననే అనిపిస్తోంది. గత కొన్నాళ్లుగా వీరిద్దరూ విడిపోతున్నారనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. దీనికి తోడు వీరిద్దరి సహజీవనం మీద లాన్ హాల్పెరిన్ రాసిన పుస్తకం బ్రాంజెలీనాలో వీరిద్దరూ త్వరలో విడిపోనున్నారని రాసారు. ఇప్పుడొస్తున్న వార్తలయితే వారిద్దరూ విడిపోయారు, వారి ఆస్తిని సమంగా పంచుకోవడానికి వీరిద్దరూ లాయర్ సాయాన్ని కూడా తీసుకుంటున్నారు అని వినిపిస్తున్నాయి. ఇక వీరిద్దరూ తరచుగా గొడవపడుతూవుంటారని, అందులోనూ ముఖ్యంగా బ్రాడ్ పిట్ తాగుడు గురించి, తన మాజీ భార్య అనిస్టాన్ తో స్నేహంగా ఉండటం గురించి జోలీ అతన్ని ఎప్పుడూ నిలదీసేదంట. జోలీ తన మాజీ భర్తలతో స్నేహంగా ఉంటున్నప్పటికీ బ్రాడ్ అనిస్టాన్ తో మాట్లాడటానికి అనుమతించేది కాదట. దీనికి తోడు బ్రాడ్ విపరీతంగా బీర్ తాగుతూవుండటం కూడా వీరిద్దరి మధ్య ఎప్పుడూ గొడవకు దారి తీసేదట. దీంతో వారిద్దరూ విడిపోవాలనే నిర్ణయానికి వచ్చారట. ఈ నెల మొదటి వారంలోనే వారిద్దరూ విడాకుల పత్రాల మీద సంతకాలు చేసారట. కానీ ఈ విషయం ఇంతవరకూ బయటకు రాకుండా జాగ్రత్తపడ్డారు. దీనిపై వారి స్పందనను కోరగా అది మా వ్యక్తిగత విషయం అని దాటవేసారని, బ్రాడ్ ఆమెకు సైక్రియాట్రిస్ట్ ను కలవమని సలహా ఇచ్చాడని, జోలీ అని విషపూరితమైన వ్యక్తిగా అభివర్ణించిందని ఓ వార్తాపత్రిక కథనం. మరి కొందరయితే వారిద్దరూ విడిపోవడాన్ని తేలికగా కొట్టిపారేసారు. లాన్ హాల్పెరిన్ తన పుస్తకం బ్రాంజెలీనా అమ్మకాలను పెంచుకోవడానికి ఈ ఎత్తు వేసాడని అంటున్నారు. నిజానిజాలు తెలియాలంటే వారిద్దరి అధికారిక ప్రకటన వచ్చే వరకూ ఎదురుచూడాల్సిందే.

January 27, 2010

Heros (2008) Hindi Movie

Posted in Bollywood, Films, Hindi tagged , , at 8:12 am by itsourteamwork

Yesterday (26th Jan,2010) begin holiday, we wanted to sit in home spend some time together. While browsing thru the channels, one channel was telecasting the movie “Heros“. After changing the channels from this channel to another channel back and forth, we got interest the movie and watched it completely.

We are not going to discuss about the movie review or what is the story of the movie, whose acting is good etc. Just want to say that, its a heart touching movie and you should watch it at least once.

పవన్ కల్యాణ్ ఇక ముందు ఇంకా కీలక బాధ్యతలు

Posted in News, Politics tagged , at 5:45 am by itsourteamwork

ప్రజారాజ్యం పార్టీలో పవన్ కల్యాణ్ ఇక ముందు ఇంకా కీలక బాధ్యతలు స్వీకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. చిరంజీవి తన ఫేస్ వ్యాల్యూతో ప్రజల వద్దకు వెళ్తుండగా పవన్ కల్యాణ్ పార్టీకి సైద్ధాంతికి పునాదులను గట్టిగా వేసే పనిలో ఉన్నారు. ఆయన అనేక మంది మేధావులతో నిత్యం చర్చలు జరుపుతున్నారు. చిరంజీవికి పుస్తక పఠనం, పత్రికా పఠనం బోర్ కలిగించే విషయాలు.

పవన్ కల్యాణ్ మంచి చదువరి. ఆయనకు సామాజిక స్పృహ చాలా ఎక్కువ. నిరాడంబర జీవితం ఆయనది. అభివృద్ధి ఫలాలు అన్ని వర్గాల ప్రజలకు అందాలన్నది ఆయన తాపత్రయం. “చిరంజీవి కంటే పవన్ కల్యాణ్ కే సామాజిక న్యాయంపై ఎక్కువ అవగాహన ఉంది” అని మందకృష్ణ మాదిగ ప్రశంసించడం విశేషం. దేవేందర్ గౌడ్, గద్దర్ వంటి వారు కూడా పవన్ నాలెడ్జిని చూసి ఆశ్చర్యపోతున్నారు. ఒక యువ సినిమా హీరోకి ఈ నాలెడ్జి ఉంటుందని ఎవరూ అనుకోరు కదా. రాజకీయాలు కలిసొస్తే పవన్ సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పే అవకాశముందని తాజా టాక్

January 20, 2010

Column Selector and the Effect of Formatting Changes

Posted in OBI EE tagged , at 1:26 am by itsourteamwork


We have a simple report with a column selector. All the columns in the report are having some formatting like color, font etc.


When the column is changed by using the column selector, the selected column is getting displayed with existing formatting. The default OBI EE format is used for the selected column. Chagned the dim to Brand for the above report and the output displayed is



The format can be retained even when the column is changed in two ways.
1. In compound layout, select other dim value from the column selector.


Go to the edit view of the table view.


Change the format of the column selector column as per the first column’s format


Accept the changes and go back to Compound Layout.

If the report is executed and the columns are switched between Region and Brand, the format will not change.

The same process needs to be repeated for all the columns that are added to the column selector.

2. Other option is changing the XML

<saw:report xmlns:saw=”com.siebel.analytics.web/report/v1″ xmlns:xsd=”http://www.w3.org/2001/XMLSchema&#8221; xmlVersion=”200705140″ xmlns:xsi=”http://www.w3.org/2001/XMLSchema-instance&#8221; xmlns:sawx=”com.siebel.analytics.web/expression/v1″>
<saw:criteria subjectArea=”Paint”>
<saw:columns>
<saw:column formula=”Markets.Region” columnID=”c0″>
<saw:displayFormat suppress=”default” interaction=”default” fontColor=”#000080″ fontSize=”12″ backgroundColor=”#e7e7f7″ fontFamily=”Lucida Sans Unicode” fontStyle=”bold”/>
<saw:columnHeading>
<saw:displayFormat interaction=”default”/></saw:columnHeading></saw:column>
<saw:column formula=”Periods.&quot;Year&quot;” columnID=”c1″>
<saw:displayFormat suppress=”default” interaction=”default” fontSize=”9″ fontColor=”#000080″/>
<saw:columnHeading>
<saw:displayFormat interaction=”default”/></saw:columnHeading></saw:column>
<saw:column formula=”&quot;Sales Measures&quot;.Dollars” columnID=”c2″>
<saw:displayFormat suppress=”default” interaction=”default” fontColor=”#000080″ fontSize=”9″/>
<saw:columnHeading>
<saw:displayFormat interaction=”default”/></saw:columnHeading></saw:column></saw:columns></saw:criteria>
<saw:views currentView=”0″>
<saw:view xsi:type=”saw:compoundView” name=”compoundView!1″ rptViewVers=”200510010″>
<saw:cvTable>
<saw:cvRow>
<saw:cvCell viewName=”titleView!1″>
<saw:displayFormat/></saw:cvCell></saw:cvRow>
<saw:cvRow>
<saw:cvCell viewName=”columnSelectorView!1″/></saw:cvRow>
<saw:cvRow>
<saw:cvCell viewName=”tableView!1″>
<saw:displayFormat/></saw:cvCell></saw:cvRow></saw:cvTable></saw:view>
<saw:view xsi:type=”saw:titleView” name=”titleView!1″ rptViewVers=”200510010″/>
<saw:view xsi:type=”saw:tableView” name=”tableView!1″ rptViewVers=”200510010″ showHeading=”false”/>
<saw:view xsi:type=”saw:columnSelectorView” name=”columnSelectorView!1″ rptViewVers=”200510010″ labelPosition=”left” goButton=”false”>

<saw:selector columnID=”c0″ bPrompt=”true”>
<saw:choice type=”column” formula=”Markets.Region”>
<saw:displayFormat
suppress=”default”
interaction=”default”
fontColor=”#000080″
fontSize=”12″                                                                                                                                                                                                                                                                                                                                                                       backgroundColor=”#e7e7f7″
fontFamily=”Lucida Sans Unicode”
fontStyle=”bold”/>
<saw:columnHeading>
<saw:displayFormat interaction=”default”/></saw:columnHeading></saw:choice>
<saw:label>
<saw:caption>
<saw:text>Select Dim:</saw:text></saw:caption></saw:label>

<saw:choice type=”column” formula=”Products.Brand”/>

</saw:selector>

</saw:view>
</saw:views>
</saw:report>


The first highlighted XML code is responsible for the formatting for the first column.
Second highlighted code is the one whose formatting needs to be chagned. Make the following changes to the XML.


·    For the second highlighted code, remove the ‘/’ which is before ‘>’ so that the line will look like

<saw:choice type=”column” formula=”Products.Brand”>


·    After the line, copy and paste the first highlighed code below. Now the code will look like

<saw:choice type=”column” formula=”Products.Brand”>

<saw:displayFormat
suppress=”default”
interaction=”default”
fontColor=”#000080″
fontSize=”12″                                                                                                                                 
backgroundColor=”#e7e7f7″
fontFamily=”Lucida Sans Unicode”
fontStyle=”bold”/>
<saw:columnHeading>
<saw:displayFormat interaction=”default”/></saw:columnHeading></saw:choice>

Same thing can be repreated for all the columns, which are placed in the column selector.

January 18, 2010

ఎంత పెద్ద హీరో అయినా డోంట్ కేర్

Posted in Films, News tagged , , at 7:40 am by itsourteamwork


నాకు ముక్కుసూటిగా వ్యవహరించడం చాలా ఇష్టం అని త్రిష అంటోంది. అందుకే కథ నచ్చకపోతే నిర్మోహమాటంగా నో చెప్పేస్తదట. అది ఎంత పెద్ద హీరో సినిమా అయినా డోంట్ కేర్ అంటోంది త్రిష. అందుకే కాబోలు అటు బాలీవుడ్ లోను, కోలీవుడ్ లోనూ, టాలీవుడ్ లోనూ తెలివిగా బాగా పయనిస్తోంది. బాలీవుడ్ లో ‘కట్టామీటా’ చిత్రంతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనున్న త్రిష, ఆ చిత్రం షూటింగ్ తో బిజీ, బిజీగా వుంటోంది. ఓ పక్క టాలీవుడ్లోనూ, ఇంకో ప్రక్క కోలీవుడ్, అదేసమయంలో బాలీవుడ్ ఇలా మూడు భాషల సినిమాల్నీ ఎంచక్కా త్రిష మేనేజ్ చేసేసుకుంటోంది. టాలీవుడ్, కోలీవుడ్ ఒకేసారి మేనేజ్ చేసినప్పుడు, బాలీవుడ్ నాకేమన్న పెద్ద కష్టమా అంటోన్న త్రిష, బాలీవుడ్ లోనూ హీరోలు బాగా సహకరిస్తారని చెప్పుకొచ్చింది.

ఇటు సౌత్, అటు నార్త్ చక్కబెట్టలేకనే కదా, అసిన్ దక్షిణాది సినిమాలకి గుడ్ బై చెప్పేసిందని అడిగిగే, ‘నాకు అలాంటి సమస్యేమీ లేదు, అయినా నా రూటే సెపరేటు అంటోంది త్రిష. ఓ ఇంటర్యూలో. అంతేకాదు, ఒకేసారి అక్షయ్ కుమార్ సరసన మూడు సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిన త్రిష, అక్షయ్ కుమార్ ని బీభత్సంగా ఇంప్రెస్ చేసిందట. ఇప్పటిదాకా తాను త్రిష అంత ఎక్సలెంట్ హీరోయిన్ ని చూడలేదని అక్షయ్ కుమార్ బాలీవుడో లో బోల్డంత హడావిడి చేస్తున్నాడు. అంత బాగా త్రిష, అక్షయ్ కుమార్ ని ఎలా మెప్పించేసిందో మరి !


January 15, 2010

పెళ్లి తర్వాత ఆట నుంచి తప్పుకుంటా

Posted in News tagged , at 7:38 am by itsourteamwork


పెళ్లి తర్వాత ఆట నుంచి తప్పుకుంటానని హైదరాబాద్ టెన్నిస్ సంచలనం సానియా మీర్జా చెప్పారు. సానియా మీర్జా నిశ్చితార్థం బాల్యమిత్రుడు సోహ్రాబ్ మీర్జాతో నిరుడు జులైలో జరిగిన విషయం తెలిసిందే. అయితే తన పెళ్లి ఎప్పుడు జరుగుతుందనేది మాత్రం సానియా వెల్లడించలేదు. పెళ్లి తర్వాత తాను ఆడదలుచుకోలేదని, అయితే దానికి ఇంకా కొంత వ్యవధి ఉందని ఆమె అన్నారు.

పెళ్లి తర్వాత ఆడకూడదని ఆమె ఇప్పుడు తీసుకున్న నిర్ణయమని, పెళ్లి తర్వాత కూడా ఆడాలని ఆమె ఎప్పుడైనా నిర్ణయం తీసుకుంటే కూడా అది ఆమె ఇష్టమేనని సానియా తండ్రి ఇమ్రాన్ మీర్జా అన్నారు. ఏడేళ్ల పాటు టెన్నిస్ ఆడి, టాప్ 100 ర్యాంకులో ఐదేళ్ల పాటు ఉన్న తర్వాత కొన్ని టోర్నమెంటులను బట్టి తన ఆటతీరును అంచనా వేయడం సరికాదని సానియా అన్నారు. జయాపజయాలు ఆటలో భాగమని అన్నారు.


January 13, 2010

మరోసారి మెగాస్టార్

Posted in News, Telugu tagged , , , , at 7:33 am by itsourteamwork


చిరంజీవి ఇప్పుడు మరోసారి మెగాస్టార్ అయ్యారా? కోస్తాఆంధ్రలో ఆయనకు లభిస్తున్న ఆదరణ చూస్తుంటే అలాగే అన్పిస్తోంది. వెండి తెరపై పసిడి పంట వంటి సినిమారంగాన్ని వదులుకుని ఆయన రాజకీయాల్లోకి వచ్చి తప్పు చేశారన్న అభిప్రాయం ఆయన అభిమానుల్లో ఉండేది. కానీ ఆయన ఇటీవల సమైక్యాంధ్ర వైఖరి తీసుకుని పెద్ద నాయకుడైనట్టే కన్పిస్తోంది. ఆయన తెలంగాణకు వ్యతిరేకం కానప్పటికీ వ్యూహాత్మకంగా సమైక్యాంధ్ర వైఖరి తీసుకున్నారు.

గత ఎన్నికల్లో చిరంజీవికి కోస్తాఆంధ్ర కలిసి రాకపోవడానికి రాజశేఖరరెడ్డి ఫ్యాక్టర్ ప్రధాన కారణం. కాపులు అనేక సంవత్సరాలుగా రాజశేఖరరెడ్డిని నమ్ముకున్నారు. చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చినా కాపుల విశ్వసనీత వైఎస్ మీదనే ఉండింది. అందువల్లనే చిరుకు ఆంధ్రలో ఆశించిన స్ధానాలు రాలేదు. ఇప్పుడు పరిస్ధితి మారిపోయింది. వైఎస్ లేకపోవడం, సమైక్యాంధ్ర వైఖరి తీసుకోవడం చిరంజీవికి లాభిస్తోంది. చంద్రబాబు నాయుడి ద్వంద్వ వైఖరి నచ్చని ఆంధ్రులు చిరంజీవి వైపు మొగ్గు చూపుతున్నట్టు కన్పిస్తోంది.

Next page