July 21, 2022

జయ జయ జయ ప్రియ భారత

Posted in Poem, Telugu at 4:53 pm by itsourteamwork

జయ జయ జయ ప్రియ భారత
జనయిత్రి దివ్య ధాత్రి
జయ జయ జయ శత సహస్ర
నర నారీ హృదయ నేత్రి
జయ జయ జయ సుస్యామల
సుశ్యామ చలచ్చేలాంచల
జయ వసంత కుసుమలతా
చరిత లలిత చూర్ణకుంతల
జయ మదీయ హృదయాశయ
లాక్షారుణ పదయుగళా జయ

జయ దిశాంత గత శకుంత
దివ్యగాన పరితోషణ
జయౌ గాయక వైతాళిక
గళ విశాల పద విహరణ
జయ మదీయ మధురగేయ
చుంబిత సుందర చరణ జయ

September 16, 2009

మా తెలుగు తల్లికి మల్లెపూదండ (Maa telugu thalliki)

Posted in Poem, Telugu tagged , , at 8:56 am by itsourteamwork

This is for all those Telugu people and Telugu language lovers

మా తెలుగు తల్లికి మల్లెపూదండ,

మా కన్నతల్లికి మంగళారతులు,

కడుపులో బంగారు కనుచూపులో కరుణ,

చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి.


గలగలా గోదారి కదలిపోతుంటేను

బిరాబిరాక్రిష్ణమ్మ పరుగులిడుతుంటేను

బంగారు పంటలే పండుతాయీ

మురిపాల ముత్యాలు దొరులుతాయి.


అమరావతినగర అపురూప శిల్పాలు

త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు

తిక్కయ్య కలములొ తియ్యందనాలు

నిత్యమై నిఖిలమై నిలచి వుండేదాకా


రుద్రమ్మ భుజశక్తి మల్లమ్మ పతిభక్తి

తిమ్మరసు ధీయుక్తి, కృష్ణరాయల కీర్తి

మా చెవులు రింగుమని మారుమ్రోగేదాక

నీ ఆటలే ఆడుతాం, నీపాటలే పాడుతాం

జై తెలుగు తల్లి ,జై తెలుగు తల్లి!!!