September 26, 2010

Chaning Dress Quickly

Posted in Hollywood tagged at 2:21 am by itsourteamwork

Another One : Excellent

August 6, 2010

Hollywood actress Julia Roberts is now a Hindu

Posted in Films, Hollywood, News tagged , , , , at 2:09 pm by itsourteamwork

Read in Telugu
Read in English

January 28, 2010

తట్టుకోలేనని ఆమెను వదిలేసాడట

Posted in Films, Hollywood, News tagged , , at 12:53 pm by itsourteamwork

ప్రముఖ పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ వరల్డ్ టూర్ లో వుండగా తన ఏజెంట్, మిత్రుడు జాసన్ ట్రావిక్ ను ప్రేమిస్తున్నట్టు తెలిపింది. కానీ ట్రావిక్ ఆమె ప్రేమను ఒప్పుకోలేదు. కేవలం స్నేహితులుగా మిగిలిపోదామని చెప్పాడు. కానీ బ్రిట్నీ మాత్రం పట్టు వదలకుండా అతని ప్రేమకోసం పరితపించింది. ఆమె పట్టుదలతో చివరికి ట్రావిక్ ప్రేమను గెలుచుకుంది. ఆ తర్వాత ట్రావిక్ బ్రిట్నీ మాజీ భర్తను కలిసి తాను బ్రిట్నీని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్టు చెప్పి, అందుకు అతని అనుమతి కూడా కోరాడు. దీంతో బ్రిట్నీ చాలా సంతోషించింది. అంతా సజావుగా జరుగుతోంది అనుకుంటుండగా జాసన్ ట్రావిక్ బ్రిట్నీని వదిలేస్తూ ఆమె నెత్తిన బాంబు వేసాడు. ఇంతకీ అతను ఆమెను వదిలేయడానికి కారణం ఏంటా అని ఆరా తీస్తే బ్రిట్నీయే అని తేలింది. ట్రావిక్ చాలా సరదా మనిషట. అందరితోనూ ఇట్టే కలసిపోయే తత్వం అతనిది. అతనికి అబ్బాయిలు ఎంత మంది స్నేహితులున్నారో అమ్మాయిలు కూడా అంతే మంది ఉన్నారట. కానీ బ్రిట్నీకి ఇది సహించలేదు. జాసన్ తనతో కాకుండా ఇంకెవరితోనైనా సన్నిహితంగా మెలిగితే ఆమె తట్టుకోలేకపోయేది. అతని మీద ఉన్న అతిప్రేమే వల్లే ఈ విధంగా జరిగిందని తెలుసుకోలేకపోయిన ట్రావిక్ ఆమె జాగ్రత్తను ఆంక్షలుగా భావించాడు. దీనికి తోడు ఇటీవల జాసన్ లాస్ ఏంజిల్స్ లోని ఓ బార్ లో బాగా మద్యం సేవించి ఇద్దరు అమ్మాయిలతో చాలా చనువుగా మెలుగుతూ కనిపించాడు. ఆ తర్వాత వారిద్దరిలో ఓ అమ్మాయితో కలసి కార్ లో తన ఇంటికి వెళ్లాడు జాసన్. ఇక్కడ మరో విషయం ఏంటంటే జాసన్ ఆ సమయంలో బ్రిట్నీ నుండీ వస్తున్న ఫోన్ కాల్స్ ను రిసీవ్ చేసుకోలేదట. ఈ విషయం ఆ నోట ఈ నోట పడి బ్రిట్నీ చెవున పడింది. దీంతో ఆమె అగ్గిమీద గుగ్గిలం అయింది. తను ప్రేమించిన వాడు చేసిన మోసాన్ని భరించలేక అతన్ని ఈ విషయమై అడిగితే అతను వారు కేవలం నా స్నేహితురాళ్లు మాత్రమే అని ఆమెకు సర్దిచెప్పే ప్రయత్నం చేసాడు. కానీ ఆమె మానసిక స్థాతి బాగోకపోవడం వల్ల విపరీతంగా ప్రవర్తించింది. దీంతో ట్రావిక్ నేనిక ఆంక్షలను తట్టుకోలేనని చెప్పి ఆమెను వదిలేసాడట.

బ్రాడ్ పిట్, ఏంజలీనా జోలీ విడిపోయారా..??

Posted in Films, Hollywood, News tagged , , at 12:50 pm by itsourteamwork

హాలీవుడ్ లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన అందమయిన జంట బ్రాడ్ పిట్, ఏంజలీనా జోలీ విడిపోయారా..?? ఇప్పుడు అంతటా వినిపిస్తున్న వార్తలను వింటుంటే అవుననే అనిపిస్తోంది. గత కొన్నాళ్లుగా వీరిద్దరూ విడిపోతున్నారనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. దీనికి తోడు వీరిద్దరి సహజీవనం మీద లాన్ హాల్పెరిన్ రాసిన పుస్తకం బ్రాంజెలీనాలో వీరిద్దరూ త్వరలో విడిపోనున్నారని రాసారు. ఇప్పుడొస్తున్న వార్తలయితే వారిద్దరూ విడిపోయారు, వారి ఆస్తిని సమంగా పంచుకోవడానికి వీరిద్దరూ లాయర్ సాయాన్ని కూడా తీసుకుంటున్నారు అని వినిపిస్తున్నాయి. ఇక వీరిద్దరూ తరచుగా గొడవపడుతూవుంటారని, అందులోనూ ముఖ్యంగా బ్రాడ్ పిట్ తాగుడు గురించి, తన మాజీ భార్య అనిస్టాన్ తో స్నేహంగా ఉండటం గురించి జోలీ అతన్ని ఎప్పుడూ నిలదీసేదంట. జోలీ తన మాజీ భర్తలతో స్నేహంగా ఉంటున్నప్పటికీ బ్రాడ్ అనిస్టాన్ తో మాట్లాడటానికి అనుమతించేది కాదట. దీనికి తోడు బ్రాడ్ విపరీతంగా బీర్ తాగుతూవుండటం కూడా వీరిద్దరి మధ్య ఎప్పుడూ గొడవకు దారి తీసేదట. దీంతో వారిద్దరూ విడిపోవాలనే నిర్ణయానికి వచ్చారట. ఈ నెల మొదటి వారంలోనే వారిద్దరూ విడాకుల పత్రాల మీద సంతకాలు చేసారట. కానీ ఈ విషయం ఇంతవరకూ బయటకు రాకుండా జాగ్రత్తపడ్డారు. దీనిపై వారి స్పందనను కోరగా అది మా వ్యక్తిగత విషయం అని దాటవేసారని, బ్రాడ్ ఆమెకు సైక్రియాట్రిస్ట్ ను కలవమని సలహా ఇచ్చాడని, జోలీ అని విషపూరితమైన వ్యక్తిగా అభివర్ణించిందని ఓ వార్తాపత్రిక కథనం. మరి కొందరయితే వారిద్దరూ విడిపోవడాన్ని తేలికగా కొట్టిపారేసారు. లాన్ హాల్పెరిన్ తన పుస్తకం బ్రాంజెలీనా అమ్మకాలను పెంచుకోవడానికి ఈ ఎత్తు వేసాడని అంటున్నారు. నిజానిజాలు తెలియాలంటే వారిద్దరి అధికారిక ప్రకటన వచ్చే వరకూ ఎదురుచూడాల్సిందే.